CM Jagan: నేడు కడపలో సీఎం జగన్ మూడో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Kadapa Tour Third Day Schedule: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో మూడో రోజు పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత సీఎం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9:25 నుంచి 10 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం 10 గంటలకు రాజీవ్ మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కు అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు. 10:50 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి.. 11:00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
Adipurush: యూట్యూబ్‌లో లీక్ అయిన ఆదిపురుష్.. కొన్ని గంటల్లోనే 2 మిలియన్ల వ్యూస్
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
అక్కడి నుంచి 11:10 గంటలకు అల్‌డిక్సన్ యూనిట్‌కి చేరుకుని.. ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత 11.35 నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో గడుపుతారు. ఆ కార్యక్రమాల్ని ముగించుకున్నాక.. 11.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 12.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. 1.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. సీఎం జగన్ మూడో రోజు పర్యటనలో భాగంగా.. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రాంతాల్లో ఎలాంటి అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Ghaziabad: అమ్మాయిలను మతం మారాలంటూ ఒత్తిడి చేశారు.. దొరికిపోయారు
అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మూడు చోట్ల సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణాలకు గండికోటలో భూమిపూజ చేశారు. గండికోట, తిరుపతి, విశాఖలో వీటిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టడం సంతోషమని, ఒబెరాయ్ గ్రూప్ ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్ కడుతోందని అన్నారు. ఒబెరాయ్ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!