తన స్వంత జిల్లా కడపలో సీఎం జగన్ (cm Jagan) పర్యటించారు. వేల్పుల (velpula) లో సచివాలయ కాంప్లెక్స్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం సచివాలయ కాంప్లెక్స్ సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. వేల్పులలో ఒకే ప్రాంగణంలో అన్ని ప్రభుత్వ సంక్షేమ భవనాలు ఏర్పాటుచేశామన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్ జిల్లా చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు చిరుజల్లులు స్వాగతం పలికాయి.
Read Also:Russia: ఉక్రెయిన్‌పై దాడిని వ్యతిరేకించిన వ్యాపారవేత్త.. ఆస్పత్రి కిటికీ నుంచి పడి మృతి
ఆరు ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటుచేశారు. గ్రామ సచివాలయం, బ్రాంచ్ తపాలా కార్యాలయం, వైయస్‌ఆర్ విలేజ్ క్లినిక్ (Ysr Village clinics) , వైయస్‌ఆర్ రైతు భరోసా కేంద్రం, వైయస్‌ఆర్ డిజిటల్ లైబ్రరీ (Ysr Digital Library) , ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రం భవనాలను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. భవన నిర్మాణాలను పరిశీలించిన అనంతరం అక్కడున్న సిబ్బందితో సీఎం వైయస్ జగన్ ముచ్చటించారు. సచివాలయ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.3వ తేదీవరకు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2వ తేదీ ఉదయం 8.30 నిమిషాలకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
Read Also: Mamata Banerjee: ఆర్ఎస్ఎస్‌కు మద్దతుగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం