Realme GT8 Pro Aston Martin F1 Limited Edition: రియల్ మీ (realme) సంస్థ ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా Realme GT8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫార్ములా 1 రేసింగ్ టీమ్ Aston Martin F1 సహకారంతో రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్, రేసింగ్ ప్రేరణతో కూడిన అత్యాధునిక డిజైన్, ప్రీమియమ్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ లా ఉండేలా రూపొందించబడింది. ఇందులో రెండు ప్రత్యేక Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ డెకో డిజైన్ తోపాటు కస్టమ్ ఫోన్ కేసులు, కస్టమ్ SIM ఎజెక్టర్ టూల్ అందించబడింది.

డిజైన్ పరంగా ఈ ఫోన్ కార్బన్ ఫైబర్ టెక్స్‌చర్ కెమెరా మాడ్యూల్, మెకానికల్ అసెంబ్లీ డిజైన్, రేసింగ్ మెటాలిక్ పెయింట్ గ్లాస్ బ్యాక్ కవర్ తో అద్భుతంగా కనిపిస్తుంది. అదే రంగులో ఉన్న మెటల్ ఫ్రేమ్, లెమన్ కలర్ స్కీమ్ ఆస్టన్ మార్టిన్ F1 టీమ్ రంగులను ప్రతిబింబిస్తాయి. అలాగే సిల్వర్ వింగ్ లోగో, డబుల్ వింగ్ ఏరోడైనమిక్ కర్వ్స్, కొత్త కాంకేవ్ ప్రాసెస్ డిజైన్ ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయి. సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ రేసింగ్ థీమ్‌తో కూడిన కస్టమైజ్డ్ UI, ప్రత్యేక కెమెరా వాటర్‌మార్క్ ఫీచర్‌ను కలిగి ఉంది.
ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే realme GT8 Pro Aston Martin F1 లిమిటెడ్ ఎడిషన్ 6.79 అంగుళాల 2K+ OLED డిస్‌ప్లే (1440×3136 పిక్సెల్స్ రిజల్యూషన్)తో వస్తుంది. ఇది 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 (3nm) చిప్‌సెట్‌తో పాటు Adreno 840 GPU, R1 గ్రాఫిక్స్ చిప్ ఉన్నాయి. ఇది 16GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్‌లో లభిస్తుంది. కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50MP Ricoh GR యాంటీ గ్లేర్ మెయిన్ కెమెరా (OIS), 50MP అల్ట్రా-వైడ్ (116°), 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్, 6x లాస్‌లెస్, 120x హైబ్రిడ్ జూమ్)ను కలిగి ఉంది. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే ఇది 7000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందించబడింది. ఫోన్ IP66+IP68+IP69 సర్టిఫికేషన్లతో డస్ట్. వాటర్‌ప్రూఫ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది.

ఇతర ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Wi-Fi 7, బ్లూటూత్ 6.0 ఉన్నాయి. realme UI 7.0 ఆధారంగా Android 16 పై పనిచేసే ఈ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో 5499 యువాన్స్ (భారత కరెన్సీలో రూ. 68,000)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది.