మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ లో ఓ సివిల్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ బీచ్ రోడ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి కి చెందిన గోపాలకృష్ణ (26)గా గుర్తించారు. నగరంలోని ఓ రియల్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు గోపాలకృష్ణ. అయితే మద్యం మత్తులో మాటా మాట పెరిగి గొడవకు దిగ్గారు స్నేహితులు. దాంతో గోపాలకృష్ణను కత్తితో పొడిచి గాయపరిచాడు బ్రహ్మాజీ అనే వ్యక్తి. అతడిని వెంటనే కేజీహెచ్ కు తరలించారు స్నేహితులు. కానీ చికిత్స పొందుతు మృతి చెందాడు గోపాలకృష్ణ. ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉండగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.