TDP Gouthu Sirisha : టీడీపీ మహిళా నేతకు సీఐడీ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందడం లేదంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తు్న్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా.. కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని, లబ్ధిదారులకు ఈ ఏడాది ఆ రెండు పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణలపై అధికారులు ఆమె గత రాత్రి 10 గంటలకు నోటీసులు ఇచ్చారు.
రేపు ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కాగా, ఇదే ఆరోపణపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ కో ఆర్డినేటర్ అప్పిని వెంకటేశ్‌ను నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. కాగా, నోటీసులు అందుకున్న శిరీష విచారణకు హాజరుకానున్నట్టు వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!