వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందడం లేదంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తు్న్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా.. కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మహిళా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని, లబ్ధిదారులకు ఈ…