AP Crime: చిత్తూరులో విషాదం.. పెళ్లైన ఐదు రోజులకే నవ వరుడు మృతి.. అసలు ఏం జరిగింది..?
- చిత్తూరు జిల్లా వి. కోటలో విషాదం..
- పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు మృతి..
- గుండెపోటుతో ప్రాణాలు విడిచిన వరుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లికి వేసిన పందిరి తీయనేలేదు. అప్పగింతలు కూడా పూర్తయ్యాయో లేదో.. అప్పుడే ఆ నవ వధువు కలలు కల్లలయ్యాయి. ఏడు అడుగులు వేసి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను దురదృష్టం వెంటాడింది. పెళ్లైన ఐదు రోజులకే వరుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలోచోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట పట్టణలో పెళ్లయిన 5 రోజులకే నవ వరుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
Read Also: Pistachio: పిస్తా తెగ తినేస్తున్నారా..? ప్రయోజనాలే కాదు ఇబ్బందులు కూడా తప్పవు సుమీ..
Also Read
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని వెంగసంద్రాకు చెందిన 28 ఏళ్ల కార్తీక్ అనే యువకుడికి ఇటీవలే పెళ్లయ్యింది. రామకుప్పం మండలం కొల్లుపల్లికి చెందిన భవాని అనే యువతితో ఐదు రోజుల కిందట పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తంతు పూర్తయిన తర్వాత బంధువులు అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పగింతల కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక దాంపత్య జీవితం సంతోషంగా సాగిద్దామని ఆ కొత్త జంట భావిస్తున్న సమయంలో దురదృష్టం వెంటాడింది. శుక్రవారం ఐదవరోజు కార్తీక్ అత్తగారింటికి వచ్చాడు. అయితే అనారోగ్యంగా ఉందంటూ భార్యను తీసుకుని ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే గుండెపోటుతో చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కార్తీక్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని అతనికి కేవలం గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడ్డారని కాని వైద్యలు సరైనా వైద్యం అందించలేదంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..