Mayor Couple Murder Case: నేడు చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో తుది తీర్పు వెలువరించనుంది కోర్టు.. నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో కటారి దంపతులు హత్యకు గురయ్యారు.. పదేళ్ల తర్వాత తీర్పు వెలువడనుండడంతో తీర్పుపై అంతటా ఉత్కంఠ నెలకొంది.. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు వద్ద చిత్తూరులో భారీ భద్రత, 30 యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు.. దివంగత మేయర్ దంపతులు కఠారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసు తుది తీర్పు వెలువరించనుంది ప్రత్యేక కోర్టు.. కాగా, 2015 నవంబర్ 15వ తేదీన చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.. మునిసిపల్ కార్యాలయంలోని ఛైర్మెన్ కార్యాలయంలో ఛైర్మెన్ శ్రీమతి అనురాధ , మోహన్ లను తుపాకీలతో కాల్చి, కత్తులతో నరికి చంపారు దుండగులు.. ఈ హత్యకు సంబంధించి మొత్తం 23 మంది నిందితులను చేర్చుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు.. ప్రస్తుతం నిందితులలో కాళహస్తికి చెందిన నిందితుడు కావటం రమేష్ స్క్వాష్ పిటీషన్ ద్వారా కేసునుంచి తొలగించారు.. మరో నిందితుడు మృతి చెందాడు.. ఈ కేసులో 163 మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఈ రోజు తుది తీర్పు వెలువరించనుంది.. ఈ నేపథ్యంలోనే కోర్టు పరిసరాలు, చిత్తూరులో ఎలాంటి అల్లర్లు, సంబరాలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు..
Read Also: Kurnool Road Accident: కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. సీఎం, మాజీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసులో నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. కోర్టు ఆవరణలో ఎలాంటి సమస్య తలెత్తకుండా బాంబు స్క్వాడ్, స్పెషల్ పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంపై పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక చిత్తూరు నగరంలో కూడా ఎక్కడా ఎలాంటి శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు.