Chittoor Mayor Couple Murder Case: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిలపై హత్యా యత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది. వారికి అక్టోబర్ 27వ తేదీ వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించింది. అలాగే, A6 నుంచి A23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇక, 2015 నవంబర్ 15న మాజీ మేయర్ దంపతులు కటారి అనురాధ, కటారి మోహన్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. తన అత్తమామలను దారుణంగా హత్య చేశారని తెలిపారు. న్యాయం గెలిచిందని ఆమె అన్నారు. ఈ నెల 27వ తేదీన కోర్టు శిక్ష ఖరారు చేయనున్నట్లు వివరించారు హేమలత..
Read Also: Kurnool Bus Accident: డ్రైవర్ అలా చేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.. బాధితుడి ఆవేదన..
కాగా, 2015 నవంబర్ 15వ తేదీన చిత్తూరు మునిసిపల్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.. మునిసిపల్ కార్యాలయంలోని ఛైర్మన్ కార్యాలయంలో ఛైర్మన్ శ్రీమతి అనురాధ , మోహన్ లను తుపాకీలతో కాల్చి, కత్తులతో నరికి చంపారు దుండగులు.. అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో తొలుత 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే శ్రీకాళహస్తికి చెందిన కాసారం రమేష్ అనే వ్యక్తికి ఈ కేసులో సంబంధంలేదని న్యాయస్థానం గతంలో తీర్పునిచ్చింది. ఇక మరో నిందితుడు శ్రీనివాస ఆచారి అనారోగ్యంతో కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. దీంతో నిందితులు 21 మందిగా మిగిలారు. ఈ కేసులో 163 మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఈ రోజు తుది తీర్పు వెలువరించింది కోర్టు..