చంద్రబాబు విశ్వాసం కోల్పోయారు.. ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. అయితే, మేం ఎన్నికలను బహిష్కరించడం వల్లే ఈ ఫలితాలు అంటోంది తెలుగుదేశం పార్టీ.. కానీ, వైసీపీ మాత్రం టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోంది.. కుప్పంలో చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు.. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వ్యాఖ్యానించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పులు తెలుసుకోవాలని సూచించారు.. కోర్టుల ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారని విమర్శించిన ఆయన.. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు.
ఇకనైనా చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని సూచించారు వైసీపీ ఎంపీ రెడ్డప్ప.. ఎన్నికల్లో ఓటమి భయంతో ఎన్నికల బహిష్కరణ నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేసిన ఆయన.. తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గు శరం లేదని మండిపడ్డారు.. ఎన్నికలను బహిష్కరించినవాళ్లు బీ ఫాంతో నామినేషన్ ఎలా వేశారు అని ప్రశ్నించారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల వల్లే భారీ విజయం సాధించామని స్పష్టం చేసిన రెడ్డప్ప.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం.. వైఎస్ జగన్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..