టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడుకి ముందే జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి, పార్టీజిల్లా అధ్యక్షులు కూన రవికుమార్. రేపు సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటలవరకు వరకు గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటారు.…