Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Chandrababu Request To Donors About Godavari Flood Victims

Chandrababu Naidu: వరద బాధితులను మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి

Published Date :July 30, 2022
By Ramesh Nalam
Chandrababu Naidu: వరద బాధితులను మానవతావాదులు, దాతలు ఆదుకోవాలి

Chandrababu Naidu: ఇటీవల గోదావరి వరదలకు పలు లంక గ్రామాల బాధితుల్లో కొందరు ఇంకా నిస్సహాయస్థితిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాతలకు పిలుపునిచ్చారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని దాతలను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. మానవత్వాన్ని మరచిందని చంద్రబాబు ఆరోపించారు. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయని.. వాటి కోసం ఎండుగడ్డిని దాతలు అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Read Also: Auto Driver Selfie Video: సెల్ఫీ వీడియో తీసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య

వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు కూరగాయలు, బియ్యం దొరక్క ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుంచి 7 రోజులు నిల్వ ఉండిపోయాయని… ఇళ్లలో బురద చేరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పనికి రాకుండా పోయిన దృశ్యాలు తన పర్యటనలో చూశానని చంద్రబాబు వివరించారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని విమర్శలు చేశారు. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్‌ కొంత మేరకు సాయం అందించిందని.. ఇంకా సాయం కొనసాగిస్తోందని చంద్రబాబు తెలిపారు. తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉందని.. దాతలు వారి పేరుతో గానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయాలన్నారు. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించాలని దాతలను కోరుతున్నట్లు చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు సాధ్యమైనంత వరకు ప్రజలకు కూరగాయలు, బియ్యం.. పశువులకు ఎండుగడ్డి వితరణ చేయాలన్నారు.

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • chandrababu request
  • flood victims
  • godavari floods

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Lanka villages: ముంపే కాదు ముహూర్తాలు ముంచుకొస్తున్నాయి.. లంక గ్రామాల్లో పెళ్లి కష్టాలు..!

Breaking: వైఎస్‌ విజయమ్మకు తప్పిన ప్రమాదం

CM YS Jagan Mohan Reddy: గర్వంగా చెబుతున్నా… నా అక్క చెల్లెమ్మలకు రాఖీ పండుగ కానుక ఇదే..

Dharmana Prasada Rao: బాధితులు ఎవరూ లేని ఘటనలో టీడీపీ ఆరోపణలు.. అది చంద్రబాబు నైజం..!

Bhimavaram Politics : ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతలు నిరుత్సహంలో ఉన్నారా..? కారణం ఏంటి..?

తాజావార్తలు

  • PM Narendra Modi: చిన్నారులతో ప్రధాని మోడీ రక్షాబంధన్‌ వేడుకలు.. వారంతా ఎవరంటే?

  • Rishabh Pant: అక్క.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలెయ్

  • Election Commission of India: “సాలు దొర‌- సెలవు దొర” ప్రచారంపై ఈసీ అభ్యంతరం.

  • Attack on Bus Driver: అరాచకం.. నచ్చిన పాట పెట్టలేదని బస్సు డ్రైవర్‌పై దాడి,, పొలంలోకి లాక్కెళ్లి..!

  • CM KCR: ప్రజలకు సీఎం రాఖీ విషెస్.. బీజేపీపై కేటీఆర్ కౌంటర్స్

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions