Chandrababu Naidu: రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలోని శాంతిపురం మండలానికి చేరుకున్న ఆయన.. మరోసారి సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు.. జగన్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం జగన్ చివరి తప్పు అవుతుందని, మీటర్లు పెట్టకుండా రైతులు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. లేకపోతే.. ఈ మీటర్లు రైతుల పాలిట ఊరితాళ్ళు అవుతాయని ఆగ్రహించారు.
ఆంధ్రప్రదేశ్‌ను మరో శ్రీలంక కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. నాడు రావణుడు చేసిన తప్పుకు లంక దహనమైందని చెప్పిన ఆయన.. జనం మేలుకోకపోతే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తుందని విమర్శించారు. గడప గడపకు వచ్చే ప్రతీ వైసీపీ ప్రజా ప్రతినిధులను సమస్యలపై నిలదీయమని ప్రజల్ని కోరారు. ఆదర్శ నియోజకవర్గమైన కుప్పంలోనూ ధన రాజకీయాలు చేస్తున్నారని, 1000 రూపాయలు ఇచ్చి లక్ష దోచేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో చేపలకు ఎర వేసినట్లు.. జగన్ ప్రజలకు ఎర వేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
Also Read
- CM Chandrababu: విద్యార్థిని శివాని మృతి తీవ్ర విచారం కలిగించింది.. యువత ధైర్యంగా నిలబడాలి!
- Student Death: సీఎంతో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య.. రంపచోడవరంలో కలకలం!
- Weather Forecast Today: వాయుగుండం ప్రభావం.. ఇవాళ పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు!
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ల సంబరాలకు డబ్బు ఎక్కడిది.? మహేష్ జెఠ్మలానీ అనుమానాలు..
-
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
-
2020 Delhi Riots Case: తాహిర్ హుస్సేన్‌కు ఉరిశిక్ష విధించాలి.. ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు..
-
US: ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
-
Salman Khan: సల్మాన్‌కు ఊరట.. ‘బ్లాక్ బక్’ టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!