వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలోని శాంతిపురం మండలానికి చేరుకున్న ఆయన.. మరోసారి సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్లు.. జగన్ కూడా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం జగన్ చివరి తప్పు అవుతుందని, మీటర్లు పెట్టకుండా రైతులు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. లేకపోతే..…