CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో వెలువడుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హవా కొనసాగుతోంది.. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, సాయంత్రానికి మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్ తన ప్రధాన ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రజల సమస్యలను పరిష్కరించాలా? అంటే తాను ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నామని, ప్రభుత్వ పనితీరును గమనించే ప్రజలు కూటమికి మద్దతుగా ఓటు వేశారని చెప్పారు. ముఖ్యంగా గత మూడు రోజులుగా తుపాను సహాయక చర్యలపైనే రాత్రింబవళ్లు పనిచేశానని వెల్లడించారు.
రాష్ట్రంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే నీటిని అందించామని గుర్తుచేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. గతంలో రోడ్లను ధ్వంసం చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో అన్ని సమస్యలను పరిష్కరించేశామని తాము చెప్పడం లేదని అన్నారు. గత ప్రభుత్వ పాలన నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా ఉన్నాయని అంగీకరించారు. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన అందిస్తున్నామని, ప్రజలకు సేవలందించే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకుంటున్నామని చెప్పారు.
Also Read
- AP Municipal Election Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. టీడీపీ-జనసేన హవా!
- Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
- Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
- Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
ప్రజలు మెచ్చే పాలన అందించడమే తమ లక్ష్యమని, ప్రజల ఇబ్బందులను దూరం చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంచి పాలన అందిస్తున్నామనే నమ్మకం, విశ్వసనీయత ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు వేర్వేరుగా ఉంటాయని, అధికార పార్టీకి ఓటు వేయని వారు కూడా ఉంటారని చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలోనూ విమర్శించే వారు, ఎగతాళి చేసే వారు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక, రాబోయే రోజుల్లోనూ ప్రజలు ఇదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pakistan: ముస్లింలకు ముప్పుగా “హిందూ-యూదు కూటమి”.. పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
-
Water Tankers Strike: హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
-
AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!