Chandra Babu: వైసీపీ నేతల ఇళ్లను వైసీపీ వాళ్లే తగలబెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమలాపురం అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమను వైసీపీ మనుషులే తగులబెట్టారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంత్రి ఇంటికి అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగన్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు.
ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని.. అందుకే ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడుతున్నారని చంద్రబాబు వ్యా్ఖ్యానించారు. టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని.. వైసీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ కార్యకర్తలెవరూ భయపడేది లేదన్నారు. జగన్ చేస్తున్న దానికి అంతకు అంత చెల్లిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహానాడుకు బస్సులివ్వకుండా.. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా అని నిలదీశారు. జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి అని.. మహానాడుకు నడిచైనా ఎడ్లబళ్లల్లోనైనా రావాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఇదే మహానాడు నినాదం అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైనా బాగుందని చెప్తే తాను తిరిగి అమరావతికి వెళ్లిపోతానన్నారు. వైసీపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమపై వైసీపీకి ప్రేమ లేదని.. అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించలేదని ఆరోపించారు. విశాఖ మీద ప్రేమ ఉందని.. రాజధాని తీసుకువెళ్తానని చెప్పిన వారు రాజ్యసభ స్థానాలు ఎందుకు కేటాయించలేదో చెప్పాలన్నారు. వైసీపీకి చెందిన తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారని గుర్తుచేశారు.
ఏ ముఖం పెట్టుకుని బస్సు యాత్ర చేపడతారని నిలదీశారు. ఎస్సీలకు చెందిన 28 స్కీములను రద్దు చేశారని.. డబ్బులున్న వాడికి ఊడిగం.. పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ అని చంద్రబాబు విమర్శించారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. దావోస్‌కు వెళ్లి అదానీ, గ్రీన్ కోతో జగన్ ఒప్పందాలు చేసుకున్నారని… టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్ కోతో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు ఎందుకు కొనసాగించరని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారని.. టీడీపీ పోరాడితే కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. అనంతబాబు వ్యవహరంలో వైసీపీని ప్రజలు ఛీ కొట్టారని చంద్రబాబు ఆరోపించారు.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!