Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Case Filed Against Posani Krishna Murali In The Rajahmundry One Town Police Station

Posani Krishna Murali : కోర్టు ఆదేశాలు.. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు

Published Date :November 19, 2022 , 7:09 pm
By Sudhakar Ravula
Posani Krishna Murali : కోర్టు ఆదేశాలు.. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్ కల్యాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యందం ఇందిరా… అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో.. కోర్టును ఆశ్రయించారు.. గత కొద్ది కాలంగా స్థానిక రెండో జేఎఫ్‌సీఎం కోర్టులో యందం ఇందిరా తరపున వాదనలు వినిపించారు న్యాయవాది ఏవీఎంఎస్‌ రామచంద్రరావు.. చివరకు పోసానిపై కేసులు నమోదు చేయాలంటూ కోర్టు పేర్కొంది.. ఇక, రెండవ జేఎఫ్‌సీఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355, 500, 504, 506, 507 మరియు 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీసులు.

Read Also: Gudivada Amarnath: చంద్రబాబుకి 2019 ఎన్నికలే చివరివి.. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి?

కాగా, ఈ మధ్యే పోసాని కృష్ణ మురళికి గుడ్‌న్యూస్‌ చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా నియమించారు. గత కొన్ని ఏళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు పోసాని కృష్ణ మురళి.. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం కూడా చేశారు. మరోవైపు, విపక్షాలపై, ముఖ్యంగా జనసేన పార్టీ పై విమర్శలు చేయడంలోనూ పోసాని కృష్ణమురళి సక్సెస్ అయ్యారని.. అందుకే ఆయనకు మంచి పదవి కట్టబెట్టారనే విమర్శలు లేకపోలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • police station
  • Posani Krishna Murali
  • Posani Krishna Murali case
  • rajahmundry

తాజావార్తలు

  • Microsoft Windows: మైక్రోసాఫ్ట్‌కు ఫ్రాన్స్ బిగ్ షాక్.. ప్రభుత్వ కంప్యూటర్ల నుండి మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్‌వేర్‌ తొలగింపు

  • Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Gold Seized: ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.. లేడీ స్మగ్లర్స్ నుండి 30 కేజీల బంగారం సీజ్

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions