Cheating: వీడు మామూలోడు కాదు.. 13 మందితో పెళ్లి.. కొండాపూర్‌లోనే ఏడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో మరో నిత్య పెళ్ళికొడుకు వెలుగులోకి వచ్చాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని యువతులను మోసం చేశాడు. పెళ్లికి విడాకులు అయిన యువతులనే టార్గెట్ చేసాడు ఆ ప్రబుద్ధుడు. అదికూడా వివాహ పరిచయ వేదికే అతడ మార్గం. అయితే.. ఆ వ్యక్తికి ఏపీకి చెందిన మంత్రికి సమీప బంధువని టాక్.. దీంతో .. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. పెద్ద కంపెనీలో పనిచేస్తానని డే అండ్ నైట్ డ్యూటీలు ఉంటాయని, ఒకరి కళ్లుగప్పి ఇంకొకరి దగ్గరి వెళ్తూ కాలం వెళ్లదీశాడు. పెళ్లి చేసుకున్న వారందరినీ ఎక్కడెక్కడో ఉంచటం కాదు, పక్కపక్క వీధుల్లోనే ఉంచి ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంత అతితెలివి ఉన్న ఘనుడు ఎవరో కాదు.. ఏపీ మంత్రికి, సమీప బంధువు అడపా శివశంకర్‌బాబు.
read also: Canada: గాంధీ విగ్రహానికి అవమానం.. ఘటనను ఖండించిన ఇండియా
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ఆంధ్రా లోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్, వివాహ పరిచయ వేదిక ద్వారా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. పెద్ద ఉద్యోగం కాబట్టి క్లయింట్ దగ్గరకు వెళ్తున్నాని చెప్పి, ఒకరి దగ్గరి నుంచి మరొకరి దగ్గరికి వెళ్తూ తన విషయం బయటపడకుండా జాగ్రత్తపడటమేకాకుండా.. రకరకాల కారణాలతో డబ్బులు లాగేవాడు. ఇలా శివశంకర్ మోసానికి దగాపడ్డ బాధితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. అయితే.. శివశంకర్ మోసానికి బలైన ఇద్దరు యువతులు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతాన్ని బయటపెట్టారు.
వివాహం పేరుతో తమను మోసం చేశాడని, సుమారు 60 లక్షల వరకు నగదు.. బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు కన్నీళ్ల పర్వంతమయ్యారు. శివశంకర్ ఇప్పటికే చాలా మందిని మోసం చేసినట్టు తమకు సమాచారం ఉందని బాధితులు తెలిపారు. మోసపోయిన 13 మందిలో ఏడుగురు కొండాపూర్ ప్రాంతంలోనే ఉన్నారని, వారందరిని పక్కపక్క వీధుల్లోనే ఉంచుతూ ఈ మోసానికి పాల్పడ్డాడరని బాధితులు చెబుతున్నారు. తమలా మరికొంత మంది మోసపోకూడదన్న ఉద్దేశంతోనే.. తాము మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శివశంకర్‌పై పలు పోలీసుస్టేషన్‌లలో కేసులు ఉన్నా.. పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించడమేకాకుండా.. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!