వైసీపీకి కొత్త అర్థం చెప్పిన బీజేపీ ఎంపీ జీవీఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు.
Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
కేంద్ర పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని జీవీఎల్ తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు విడుదల చేసినా… రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు రావడం లేదని ఆరోపించారు. వైసీపీ అసమర్ధత వల్లే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మరోవైపు వైసీపీ అంటే జీవీఎల్ కొత్త నిర్వచనం చెప్పారు. వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈనెల 28న విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు జీవీఎల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!