క్లైమాక్స్‌కి పీఆర్సీ ఎపిసోడ్..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కొనసాగుతోన్న పీఆర్సీ ఎపిసోడ్‌ క్లైమాక్స్‌కి చేరినట్టుగా తెలుస్తోంది.. ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ విజ్ఞప్తితో మళ్లీ విధుల్లోకి హాజరయ్యారు.. కానీ, ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ప్రకటన మాత్రం రాలేదు.. చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. ప్రకటన రాకపోవడంతో.. మళ్లీ ఉద్యమానికి సిద్ధం అయ్యారు ఉద్యోగులు.. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. పీఆర్సీ ఎపిసోడ్‌ క్లైమాక్స్‌కు చేరినట్టు తెలుస్తోంది.. ఉద్యోగులకు సంక్రాంతి కానుగా పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Read Also: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ప్రారంభం

అందులో భాగంగా ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం నేరుగా రంగంలోకి దిగారు సీఎం వైఎస్‌ జగన్.. రేపు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు.. ఆ తర్వాత పీఆర్సీపై తుది ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, అంతకు ముందు.. అంటే ఇవాళ సీఎస్, ఆర్ధిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం జరగనుంది.. ఇప్పటి వరకు జరిగిన చర్చల సారాంశం ముఖ్యమంత్రి ముందు పెట్టనున్నారు అధికారులు.. మరోవైపు, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. అయితే, ఫిట్‌మెంట్ ఫిగర్ పెరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.. మానిటరీ బెనిఫిట్స్ అమలుపై సానుకూల స్పందన ఇస్తారా? ఇతర సమస్యల విషయంలోనూ సీఎం జగన్ హామీపై ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు.

Related Articles

Latest Articles