AP Govt vs BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాట్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలోని ఋషికొండపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టిన వాళ్లకి ఆర్థిక శాఖ నిధులు మంజూరు చేసింది.. కానీ, టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మాత్రం ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదు అని మండిపడ్డారు. ఎందుకు ఇంత వివక్ష చూస్తున్నారు అంటూ ఆర్థిక శాఖ తీరుపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: Uttar Pradesh: రోడ్డు మీదనే మొగుడిని పొట్టు పొట్టు కొట్టిన భార్య
ఇక, అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలోని 113 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది.. మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు రూ. 3,664 కోట్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే సుమారు రూ. 6,000 కోట్లు అవసరం.. త్వరలోనే నిర్మాణాలు పూర్తి అయ్యేలా దృష్టి పెట్టనున్నాం అన్నారు. అయితే, 2014–19 మధ్యలో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లు ఏపీకి కేటాయించింది.. వీటిలో 5,14,000 ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం.. కానీ, గత ప్రభుత్వం వీటిని 2,61,640 ఇళ్లకు తగ్గించడమే కాకుండా, నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదు అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Read Also: Malavika Mohanan : పెద్ద సినిమాలు కాదు.. అలాంటి పాత్రలే ముఖ్యం
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 51 ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది అని నారాయణ తెలిపారు. ఇంకా 112 ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మొత్తం రూ. 6,139 కోట్లు అవసరం.. రూ. 4,500 కోట్లు రుణంగా ఇవ్వడానికి హడ్కో అంగీకరించింది.. హడ్కో నిధులు విడుదల కాగానే బిల్లులు క్లియర్ చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.