భార్య భర్తలు అంటే అన్యోన్యంగా ఉండేవారు.. ప్రస్తుతం అన్యోన్యం మాట దేవుడెరుగు… రోడ్ల పంటే కొట్టుకుంటున్నారు. లేకపోతే.. భర్త భార్యను చంపడం లేకపోతే భార్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని లవర్ తో చంపించిన ఘటనలు చూస్తున్నాం.
పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ మధ్య భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్‌గా భార్యను నడిరోడ్డు మీద భర్త కాల్చి చంపేసి.. శవం పక్కనే కూర్చున్న వీడియో వైరల్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ మీరట్ జిల్లాలో భర్తపై భార్య దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సివిల్ లైన్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఎండీఏ కార్యాలయం ఎదుట గొడవ జరిగింది. అసలు ఎందుకు కొడుతుందో తెలియకుండా.. భర్తను కొడుతుంది భార్య. భర్తను పిడిగుద్దులు గుద్ది, కొరికి, బూతులు తిడుతూ.. అరగంట సేపు రచ్చరచ్చ చేసింది. అక్కడున్న స్థానికులు కొందరు ఆపేందుకు ప్రయత్నించినా… ఆ మహిళ తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరిని పీఎస్ కు తరలించారు. అసలు గొడవ ఏంటో.. ఆ మహిళ భర్తపై ఎందుకలా దాడి చేసిందో అర్థం కావడంలేదు. రోడ్డు మీద అందరూ చూస్తున్నారని లేకుండా అతడిపై దాడి చేసింది.
मेरठ में सड़क पर रिश्तों का तमाशा!
UP क़े ज़िला मेरठ मे थाना सिविल लाइन क्षेत्र के MDA ऑफिस के सामने पति-पत्नी के बीच पारिवारिक विवाद ने सड़क को अखाड़ा बना दिया। पत्नी ने पति को लात-घूंसों से पीटा, हाथ पर काटा और गाड़ी का शीशा तोड़ने का भी आरोप है। करीब आधे घंटे तक चला… pic.twitter.com/ozijyLN0ys
— TRUE STORY (@TrueStoryUP) September 17, 2025