Vishnu Vardhan Reddy: వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ఓ డ్రామా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VishnuVardhan Reddy: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ఓ డ్రామా అని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు కూడా డ్రామా ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయకపోవడం అందులో చిత్తశుద్ధి లేకపోవడమేనన్నారు. రాజీనామా ఆమోదించాలని రాజీనామా చేయడం లేదని.. చిత్తశుద్ధి ఉంటే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీకి విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ కూడా డ్రామా ఆడుతోందని.. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే రాయలసీమ ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. రాయలసీమ కోసం ఎపుడైనా నిధుల కోసమో, ప్రాజెక్టుల కోసమో ప్రయత్నం చేశారా అని నిలదీశారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు ద్రోహులు అని ఆగ్రహించారు.
మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ కర్నూలులో మాట్లాడడానికి సిగ్గులేకుంటే పక్కన కూర్చున్న ఏపీ కాంగ్రెస్ నేతలకైనా సిగ్గుండాలని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నది జైరాం రమేష్ అన్నారు. కరోనా సమయంలో అంబులెన్సులు అడ్డుకున్న ఘనత కేసీఆర్‌ది అని.. ఇపుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఏపీ ప్రజలు ఎలా హర్షిస్తారని ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజకీయ స్వార్థంతో వైసీపీ, టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి ఏపీలో అడుగుపెట్టాలని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఏపీ ఇంకా ఉందా.. తగలబడిపోయిందా అని చూడడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని చురకలు అంటించారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
Read Also: NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన
ఆలయాలలోని అభిషేకాల్లో వివాదాలు సృష్టిస్తున్నారని.. కాణిపాకంలో రూ.700 ఉన్న అభిషేకం టిక్కెట్ రూ.5 వేలు చేయడం అన్యాయమని విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలంలో లక్ష రూపాయలకు ఒక సేవ ప్రవేశపెట్టారని.. దేవాదాయ, ధర్మాదాయ శాఖను దేవాదాయ, ఆదాయ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. ఆలయాలలో అభిషేకాల పేరుతో వ్యాపారం చేయడం మానుకోవాలన్నారు. దోచుకోవడానికి ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఉన్నాయని.. ఆలయాల్లో కూడా దోచుకుంటారా అని ప్రశ్నించారు. చర్చిల నుంచి, మసీదుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఆలయాల నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..