Bhumana Karunakar Reddy: తిరుపతిపై పవన్ దాడికి దిగుతున్నట్టుంది.. ఎమ్మెల్యే భూమన ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy Fires On Pawan Kalyan Tirupati Visit: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతికి వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయడం కోసం ఆయన తిరుపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే.. పవన్‌పై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. వినతిపత్రం పేరుతో తిరుపతికి పవన్ దండయాత్రకు వస్తున్నట్టుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు లేదని.. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిపై దాడికి దిగుతున్నట్టు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఉన్న వైసీపీపై పవన్ నిత్య నిందలు వేస్తూనే ఉన్నాడని మండిపడ్డారు. తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో ప్రజలకు చెప్పకుండా.. నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలను పవన్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అనేది తప్ప, మేము అనేది పవన్ నోటి నుంచి రాదని పేర్కొన్నారు.
Woman Loots 27 Men: ఒక మహిళ.. 27 మంది భర్తలు.. కథలో పెద్ద ట్విస్ట్
Also Read
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ఇదిలావుండగా.. జనసేన కార్యకర్తపై అంజు యాదవ్ చెయ్యి చేసుకున్న వ్యవహారం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. ఖాకీ దుస్తుల్లో హుందాగా ప్రవర్తించాల్సిన ఆమె.. అందుకు భిన్నంగా విచిత్రంగా ప్రవర్తించడం, ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ ఇష్యూపై తిరుపతి ఎస్పీ రాష్ట్ర డీఐజీకి రిపోర్ట్ కూడా సమర్పించారు. అయితే.. ఇంతవరకూ ఆమెపై చర్యలు తీసుకోకపోవడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. ఆమె ప్రవర్తనకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తమ జనసేన కార్యకర్తపై చెయ్యి చేసుకున్న ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నారు. పవన్ తిరుపతిలో ల్యాండ్ అయ్యాక.. భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో పాల్గొనేందుకు జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు సైతం వీరిని అదుపు చేయలేకపోయారు.
Boy Killed Brother: చేపల విషయంలో గొడవ.. తమ్ముడ్ని చంపిన అన్న
తాజావార్తలు
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
-
IND vs AFG 3rd T20I: నేడే మూడో టీ20.. వైభవ్, ఠాకూర్‌కు ఛాన్స్.. స్టార్ ప్లేయర్లకు షాక్.. ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!