Bhumana Karunakar Reddy: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy Comments After Selected As TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన భూమన కరణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో ముచ్చటించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదన్నారు. సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తామన్నారు. గతంలో ఏ విధంగా పనిచేశామో.. అంతకు మించిన విధంగా సామాన్య భక్తుల కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. రెండోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వేంకటేశ్వర స్వామి కృప, సీఎం జగన్ ఆశీస్సులతో తనకు ఈ అవకాశం లభించింద్నారు.
Kishan Reddy: మోడీ నాయకత్వంలో అభివృద్ధి బాటలో ఇండియన్ రైల్వే
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
తమ అధినేత జగన్ ఇచ్చిన ఈ అవకాశాన్ని తాను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మంచి పేరు తీసుకొస్తానని భూమన పేర్కొన్నారు. గతంలో లాగా హిందు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. 15 సంవత్సరాల తరువాత తనకు మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయంలో చైర్మన్‌గా పనిచేశానని, ఇప్పుడు తనయుడు హాయంలో చైర్మన్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది కూడా వెంకన్న ఆశీస్సులతో లభించిందని భావిస్తున్నానని చెప్పారు. తండ్రి దగ్గర, కొడుకు దగ్గర పనిచేసే అవకాశం.. బహుశా ఇంకెవరికీ రాకపోయి ఉండొచ్చని చెప్పుకొచ్చారు.
Platform Fee: స్విగ్గీ బాటలోనే జొమాటో.. ఫుడ్ డెలివరీ ఒక నుంచి కాస్లీ
కాగా.. ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ఆగస్టు 8న ముగుస్తున్నందున, కొత్త పాలకమండలిని నియమించాల్సి ఉందని పేర్కొంటూ టీడీడీ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా ఆయన నియామకం తర్వాత సభ్యుల నియామకం కూడా చేపడతామని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆగస్టు 8న ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసిన అనంతరం కొత్త పాలకమండలి ఛైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి నియామకం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
తాజావార్తలు
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్‌తో ఆల్‌టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?