Platform Fee: ఇటీవల మనిషి జీవితం ఉరుకుల పరుగులమయం అయిపోయింది. అంతేకాకుండా పెరుగుతున్న ధరల దృష్ట్యా కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితులు తలెత్తాయి. టైం లేకుండా పోతోంది. పైగా ప్రస్తుత నిత్యావసరాల ధరలు చూస్తే ఏది ముట్టుకున్నా షాక్ తగులుతున్నాయి. టమాటా ధరల గురించి ప్రతిరోజూ వింటూనే ఉన్నాం కదా. కూరగాయలు ప్రజల జేబులకు గాయాలు చేస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తమ తమ పనులకు వెళ్లడంతో నిమగ్నమవుతూ ఇంట్లో వంట చేసుకునేందుకు తీరిక దొరకడం లేదు. దీని కారణంగా Swiggy-Zomato వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల పంట పండుతోంది. ఎక్కువగా జనాలు ఫుడ్ డెలివరీ యాప్ ల పైనే ఆధారపడుతున్నారు.
దీన్ని ఆసరాగా చేసుకుని కంపెనీలు లాభాలు దండుకుంటున్నాయి. ఇకనుంచి అలా ఆహారాన్ని ఆర్డర్ చేయడం భారీగా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే ఫేమస్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా తన ఆపొజీటర్ స్విగ్గీ బాటనే అనుసరించింది. జొమాటో కూడా Swiggy తరహాలోనే కస్టమర్ల నుండి ప్లాట్‌ఫారమ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించింది. అయితే ఇక్కడ ఓ మినహాయింపును ఇచ్చింది. ఈ ప్లాట్‌ఫారమ్ రుసుము ప్రస్తుతం కొంతమంది వినియోగదారుల నుండి మాత్రమే వసూలు చేయబడుతోంది. Zomato ఇన్ స్టాంట్ గ్రాసరీ ప్లాట్‌ఫారమ్ Blinkit దాని నుండి దూరంగా ఉంచబడింది. ప్రతి ఆర్డర్‌పై ఎంత ప్లాట్‌ఫారమ్ రుసుము చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకుందాం..
Read Also:BCCI: బీసీసీఐకి వచ్చే ఐదేళ్లలో భారీ ఆదాయం వచ్చే ఛాన్స్..!
ఫ్లాట్ ఫామ్ ఫీజు అంటే ఏమిటీ..?
ఫ్లాట్ ఫామ్ ఫీజు అంటే ఏదైనా యాప్ ను మనం ఉపయోగిస్తున్నందుకు సదరు ఫ్లాట్ ఫామ్ కు చెల్లించే రుసుము. జొమాటో వినియోగదారుల నుంచి ప్రతి ఆర్డర్ పై రూ.2 ప్లాట్ ఫాం ఫీజు వసూలు మొదలుపెట్టింది. రూ.2అనేది చూడ్డానికి చిన్న మొత్తంగా కనిపించినా.. రోజుకు దాదాపు 15 లక్షల ఫుడ్ డెలివరీలు చేసే స్విగ్గీకి ఈ ఫీజు వల్ల భారీగానే ఆదాయం సమకూరుతుంది. జూన్ 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్విగ్గీ భారీ లాభాన్ని ఆర్జించింది. కంపెనీ లాభాల్లోకి రావడం ఇదే తొలిసారి. దాదాపు నాలుగు నెలల క్రితం Swiggy ఫుడ్ ఆర్డర్‌లపై ప్లాట్‌ఫారమ్ ఫీజులను వసూలు చేయడం ప్రారంభించింది. Swiggy నుండి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, కస్టమర్‌లు ప్రతి ఆర్డర్‌పై రూ. 2 ప్లాట్‌ఫారమ్ ఫీజు చెల్లించాలి.
Read Also:Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
స్విగ్గీ బాటలో Zomato కొంతమంది వినియోగదారులకు మాత్రమే ప్లాట్‌ఫారమ్ రుసుమును అమలు చేసింది. ఇది కిరాణా డెలివరీ ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్‌పై ప్రభావం చూపలేదు. కంపెనీ సగటు స్థూల ఆర్డర్ విలువ దాదాపు రూ.415. దీని ప్రకారం రెండు రూపాయల ఫీజు అందులో 0.5 శాతం. ఇది చిన్న మొత్తం కావచ్చు, కానీ ఇది కంపెనీకి చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. జూన్ త్రైమాసికంలో కంపెనీకి 176 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. రోజువారీగా ఇవి దాదాపు 20 లక్షల ఆర్డర్లు. అంటే, కంపెనీ రోజువారీ ఆర్డర్‌లపై ప్లాట్‌ఫారమ్ ఫీజుగా రూ.40 లక్షలు పొందవచ్చు.