బద్వేల్‌లో రూటు మార్చిన బెట్టింగ్ రాయుళ్ళు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు.
బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి గెలుపు కంటే బీజేపీకి ఎన్ని ఓట్లు పోలవుతాయి, బీజేపీ,కాంగ్రెస్ లకు డిపాజిట్ వస్తుందా రాదా అని పందేలు కాస్తున్నారు. బీజేపీకి 25 వేల ఓట్లు దాటతాయని పందెం కాస్తున్నారు పందెం రాయుళ్ళు. కేవలం రాజకీయ వర్గాలకు మాత్రమే పరిమితం అయింది ఈ బెట్టింగ్.
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
గతంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా డిపాజిట్లు గల్లంతయిన ఈ పార్టీలకు ఇప్పుడు వేలల్లో ఓట్లు వస్తాయని బెట్టింగ్ రాయుళ్ళు పందేలు కాయడం ఆసక్తికరంగా మారింది. మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదని, బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడ గెలుపు అధికార వైసీపీదే అన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ రెండు పార్టీల లో ఇక్కడ రెండవస్థానం ఎవరిది, గౌరవప్రదంగా ఓట్లఉ ఎవరు సాధిస్తారన్న దానిపైనే ఇప్పుడు ఇక్కడ బెట్టింగులు జరుగుతున్నాయి.
ఈ రెండు పార్టీల లో ఎవరికి అయినా డిపాజిట్ దక్కుతుందా ? బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వస్తాయా ? ఎవరి బలం ఎంత? ఏ రాజకీయ పార్టీ రెపరెపలాడుతుంది? అనే కోణంలో ఇక్కడ బెట్టింగ్ లు నడుస్తున్నాయని తెలుస్తోంది. టీడీపీ అభిమానులు వైసీపీ, బీజేపీల కంటే కాంగ్రెస్ కు ఓట్లేస్తారని భావిస్తున్నారు.
బీజేపీకి ఓటు వేయకుండా ఏపీలో కమలం వాడిపోయిందని, ఇక్కడ అంత సీన్ లేదని చెప్పేందుకు కసితో ఉన్నారని తెలుస్తోంది. జనసేన ఓట్ల తమకు పడతాయని బీజేపీ గంపెడు ఆశతో ఉంది. మరి టీడీపీ ,జనసేన ఓట్లు నిజంగానే బీజేపీ, కాంగ్రెస్ కు పడతాయా? వీళ్ళకి వేసినా వేస్టే అన్న భావనతో ఫ్యాన్ గుర్తుకి గుద్దేస్తారా అన్నది వేచి చూడాలి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.
నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓడిపోయే పార్టీలపై బెట్టింగులు జరగడం సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వస్తాయన్న బెట్టింగ్‌లు ఎంతవరకూ నిజం అవుతాయో చూద్దాం.
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!