బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు. బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి…
ఏపీలో ఉప ఎన్నిక రాజకీయం రచ్చరచ్చగా మారింది. పోటీలో వున్న బీజేపీ అక్కడ ఎన్నికల తీరుపై ఈసీకి వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తూనే వుంది. తాజాగా బద్వేల్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు సోమువీర్రాజు. బద్వేల్ ఉపఎన్నికలలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఊరేగింపు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి,…