Andhra Pradesh: పొలంలో చెమట చిందించిన కలెక్టర్లు.. నెటిజన్ల ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా వీకెండ్ సెలవులు వస్తే ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దీనికి చిన్నా, పెద్ద అనే తేడా ఉండదు. అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం వీకెండ్ సెలవులలో ఇంట్లో సేదతీరకుండా పొలం వైపు అడుగులు వేశారు. ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇద్దరూ తమ భార్యాపిల్లలతో కలిసి పొలంలో చెమట చిందించారు. రైతులతో పాటు వీళ్లు కూడా పొలంలో పనిచేశారు. ఈ సందర్భంగా బాపట్ల మండలం మురుకొండపాడు గ్రామ శివారులోని పొలాల్లో కలెక్టర్లు ఇద్దరూ నాట్లు వేశారు.
విచిత్రం ఏంటంటే.. ఈ ఇద్దరు కలెక్టర్లు పక్కపక్క జిల్లాలలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్లు పొలంలో పనిచేస్తున్న ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. అసలు కలెక్టర్లు ఉన్నపళంగా పొలాలకు ఎందుకు వెళ్లారో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ దంపతులను వారి పిల్లలు వ్యవసాయం అంటే ఏంటి అని అడిగారు. దాంతో వారు సమాధానం చెప్పకుండా క్యారేజీలు కట్టుకుని నేరుగా వ్యవసాయ పొలాల వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం నాట్లు సీజన్ కావడంతో పొలంలో దిగి వ్యవసాయం చేశారు. అంతేకాదు తమతో తెచ్చుకున్న భోజనాన్ని తింటూ అక్కడి ఉన్న వారికి పెడుతూ సందడి చేశారు. కాగా రెండు జిల్లాల కలెక్టర్లు తమతో కలిసి వరి నాట్లు వేయడం చూసిన రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ లుంగీ కట్టి వరి నాట్లు వేయడమే కాక పొలం గట్లపై రైతులతో కలిసి భోజనం చేసి కాసేపు వారితో ముచ్చటించారు. అటు కలెక్టర్లు పొలంలో దిగి పనిచేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఢిల్లీకి రాజైనా.. భూమాతకు బిడ్డే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
తాజావార్తలు
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
-
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
-
Buchi Babu Sana : బుచ్చి.. నెక్ట్స్ సినిమా ఎప్పుడు బాబు.. ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరు?
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!