CM Chandrababu: ఏపీలో కొత్త పథకం.. ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- ఏపీలో ఆటో డ్రైవర్ల సేవల పేరుతో కొత్త పథకం..
- ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం..
- సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం..
- అర్హులైన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 ఇవ్వనున్న ప్రభుత్వం..
- పథకాన్ని ప్రారంభించడానికి ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కాగా, ఈ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో సింగ్ నగర్ బయలుదేరారు.
Read Also: CJI Gavai: న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు.. చట్టబద్ధంగా సాగుతోంది.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
అయితే, ఉండవల్లి దగ్గర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాధవ్ లకు మంగళగిరి చేనేత కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలు అందరినీ లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. బాణాసంచా, తీన్ మార్ డ్యాన్స్ లో మంగళగిరి యువత సందడి చేశారు. విజయవాడ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకo ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు.
Read Also: Jagtial Bride Suicide: చిన్న గొడవ.. పెళ్లైన వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..
ఇక, ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించనుంది. ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఆర్థికంగా ఆదుకోనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనుండగా.. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి లభ్ది చేకూరనుంది. అయితే, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్‌గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!