అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో ఓ దారుణం జరిగింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. వేములపల్లిలోని రామకృష్ణ పౌల్ట్రీఫారంలో రమణ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. చట్టాలు చేసినా.. కామాంధులు మాత్రం మారడం లేదు.. అన్య పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు.. అనకాపల్లి జిల్లాలో రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. దీంతో.. బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు బాలిక వచ్చి చెప్పింది. దీంతో హుటాహుటినా…