Asani Cyclone: తీవ్ర తుఫాన్‌గా ‘అసని’.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాన్ క్రమంగా బలపడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 970 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది. రాగల ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుంటుందని తెలిపింది. అనంతరం ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
తీవ్ర తుఫాన్ ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. గురువారం వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళరాదని సూచించింది. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి గంటకు 105 కి.మీ నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
Also Read
Cyclone: వాయువేగంతో రాష్ట్రం వైపు దూసుకొస్తున్న ‘ఆసాని’ తుపాన్!
తాజావార్తలు
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
-
Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
-
Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
-
Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
-
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!