Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. మూల నక్షత్ర సమయంలో సీఎం దర్శనం
- ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు
- రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తాం- మంత్రి ఆనం
- దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు
- సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి.. క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తాం- మంత్రి
- సామాన్య భక్తులకు ఈ ఉత్సవాలలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాం- ఆనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు. సామాన్య భక్తులకు ఈ ఉత్సవాలలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. 120 సీసీ కెమెరాలతో అధికారులు పర్యవేక్షిస్తుంటారు.. కంట్రోల్ రూం నుంచి ఇదంతా కంట్రోల్ చేస్తారని అన్నారు. వీవీఐపీల దర్శనాలు 8 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటాయని మంత్రి చెప్పారు. ఏ దర్శనం క్యూలైన్ వీవీఐపీల దర్శనాల సమయంలో ఆపడం జరగదన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు దర్శనం ఉంటుందన్నారు. బంగారు వాకిలి వరకే దర్శనం… అంతరాలయ దర్శనం లేదని తెలిపారు.
Read Also: Andhra Pradesh: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు పరిహారం..
Also Read
ఇదిలా ఉంటే.. ప్రసాదాల విషయంలో రాజీ ధోరణి లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అధికారులను బాధ్యులను చేస్తామన్నారు. వాటర్ బాటిళ్ళు, ప్యాకెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించాం.. 35 లక్షల వాటర్ బాటిళ్ళు, ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లపై వీఎంసీతో కలెక్టర్ సమీక్ష జరిగింది.. పారిశుధ్య బాధ్యత వీఎంసీదేనని అన్నారు. నగరమంతా ప్రత్యేక అలంకరణ 2వ తేదీ సాయంత్రానికి పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే.. మూల నక్షత్ర వేళలో సీఎం చంద్రబాబు సకుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు డిపార్ట్మెంట్ హెడ్‌లతో తుది సమీక్ష చేపడుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
Read Also: Amit Shah: కాంగ్రెస్ కార్యక్రమాల్లో ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ నినాదాలు.. రాహుల్‌గాంధీ మౌనం ఎందుకు..?
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!