ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు.