P Gowtham Reddy: చిన్న సినిమాల కోసమే ఏపీ ఫైబర్.. 39 రూపాయలకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSFL Chairman P Gowtham Reddy Talks About AP Fiber Movie System: మొదటి రోజే మొదటి షో అనే ప్రాతిపదికన.. ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా సినిమాలను అందించాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పీ. గౌతంరెడ్డి తెలిపారు. అందుకే సినిమాల్ని తక్కువ ధరకే ప్రజలకు వినోదాన్ని అందించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఇతర ఓటీటీ యాప్‌లకు, థియేటర్లకు.. ఏపీఎస్ఎఫ్ఎల్ పోటీ కాదని క్లారిటీ ఇచ్చారు. చిన్న సినిమాలకు పెద్దగా థియేటర్లు దొరకడం లేదన్న ఆయన.. ఒక పెద్ద సినిమా రిలీజైనప్పుడు, చిన్న సినిమాల్ని ఏపీ ఫైబర్ ద్వారా రూ.39కే విడుదల చేస్తున్నామన్నారు. ఇక పెద్ద సినిమాలకు ఎలాగో విడుదల సమయంలో.. టికెట్ ధరలు పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు.
MVV Satyanarayana: మూడు గంటల్లోనే కిడ్నాప్ కేసుని పోలీసులు ఛేధించారు.. నా ఫ్యామిలీ క్షేమం
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
ఏపీ ఫైబర్ ద్వారా విడుదల చేసే సినిమాలను ఏమాత్రం పైరసీకి గురవ్వకుండా.. సాంకేతిక జాగ్రత్తలు తీసుకున్నామని గౌతంరెడ్డి వెల్లడించారు. ఒకవేళ ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం కలిగించే కంటెంట్ ఉంటే.. ముందుగా దాన్ని స్క్రీనింగ్ చేస్తామని, ఆ తర్వాతే విడుదల చేస్తామని చెప్పారు. ఏపీ ఫైబర్‌కు ఉన్న 10 లక్షల మంది వినియోగదారుల్లో.. ఎక్కువ మందికి వినోదాన్ని కల్పించడమే తమ లక్ష్యమన్నారు. త్వరలోనే ఏపీ ఫైబర్ తరఫన ఓటీటీ తరహాలో ఒక యాప్ తీసుకొస్తామన్నారు. ఆరు నెలల్లో ఆ యాప్‌కు వచ్చే రెస్పాన్స్ని బట్టి.. ఇతర వీడియో కంటెట్‌ని సైతం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ కంపెనీగా ఆర్థిక పరిస్థితి సహకరిస్తే.. భవిష్యత్‌లో సినిమాలను కూడా నిర్మిస్తామన్నారు. ఈ విధానంపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకరిద్దరి నుంచి వ్యతిరేకత వచ్చినా.. పరిశ్రమకు నష్టం ఉండదని మిగిలిన వారు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. వెబ్ సిరీస్, టెలిఫిలిమ్ల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
CM YS Jagan: క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై సీఎం జగన్ సమీక్ష.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!