దళితులను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోంది అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేష్ ఏం చేస్తున్నారు అని అడిగారు. వైసీపీలోని ఓ వర్గానికి సురేష్ భయపడుతున్నారు. ఒకవేళ భయపడకపోతే దాడి చేసిన వైసీపీ నేతలను సస్పెండ్ చేయాలి. దళితుల భూములకు రక్షణ లేదు, ఉపాధికి దిక్కులేదు, ప్రాణాలకు రక్షణ లేదు. తక్షణమే దాడి చేసిన వైసీపీ నేతలను శిక్షించాలి అని పేర్కొన్నారు.