ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ తారస్థాయికి చేరుకుంది. అటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీపై దాడి తీవ్రతరం చేశారు. తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవరూ నమ్మడం లేదన్నారు. లక్షా ఇరవై వేల ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ జరుగుతోందన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో పేదల ఇళ్ళ నిర్మాణాలు జరుగలేదు. అయినా టీడీపీ మీడియాకు ఇవి కనిపించటం లేదా అని…
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనిషి రక్తం బాగా మరిగిన పులికి వేటాడటానికి మనుషులు దొరకనప్పుడు ఎలా పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తుందో, అధికారం పోయినందుకు చంద్రబాబుకి అదే పిచ్చి హిమాలయాలకు చేరిందని ఆరోపించారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు 1.39 లక్షల కోట్లు… అది కూడా 35 నెలల్లో పేదల చేతిలో వైసీపీ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంటనక్కకు…
ఏపీలో వరుసగా ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే బాదుడే బాదుడు అంటే విపక్షాలు నిరసనలకు దిగాయి. ఇది ప్రజల పట్ల బాధ్యత కలిగిన ప్రభుత్వం కాదు.. ప్రజలను బాదే ప్రభుత్వం అన్నారు జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏపీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని ప్రచారం చేసుకున్నారు. వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణాన్ని సంక్షేమ పథకంగా ఎందుకు భావించడం లేదు? ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సగటున 70…
ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా. పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్…