టీడీపీ, బాబు పనైపోయింది.. అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే నేనూ రెడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చితికిలపడిపోయింది.. ఇక, ఈ ఎన్నికలతో టీడీపీ పని అయిపోయిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందనన్నారు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది.. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదన్నారు. టీడీపీ విలువలు కాపాడు కోవాల్సిన పరిస్థితి ఉందన్న బొత్స… ఎన్నికల ఫలితాలతో ఇప్పటికైనా టీడీపీ బుద్ది తెచ్చుకోవాలని హితవుపలికారు.. ఎన్నికలు బహిష్కరణ అంటే నామినేషన్లకు ముందే ఆ విషయాన్ని తెలియజేయాలి.. కానీ, నామినేషన్లు వేశాక చేతకాక ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పారంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.
ప్రజలిచ్చిన తీర్పు స్ఫూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్ పునరంకితమవుతారు అని ప్రకటించారు మంత్రి బొత్స.. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా సీఎం జగన్ అమలు చేస్తారన్న ఆయన.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరైంది కాదన్నారు.. అయితే, అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయమనండి.. నేనూ రాజీనామా చేస్తాను.. ఇద్దరూ రాజీనామా చేసి పోటీ చేసి ప్రజాబలం ఏమిటో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.. స్థాయిని తగ్గించేలా టీడీపీ నేతలు మాటలు మట్లాడవద్దన్న ఆయన.. టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడిని చంపడానికి, కొట్టడానికే ఆయన ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారనడం సరికాదన్నారు. ఇక, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపిన మంత్రి బొత్స.. రాష్ట్రంలో 60 లక్షల మందికి ఇంటిపై శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని.. దీనికోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారని.. డిసెంబర్ లోపు 80వేల టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించారు.
Also Read
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
- Saikrishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం..
తాజావార్తలు
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!