Home Minister Anitha: వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు. మా ప్రభుత్వంలో సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఏ కేసులోనూ ముందుకు వెళ్లలేదు.. తప్పు చేసిన వారిని పారదర్శకంగానే శిక్షిస్తున్నాం.. టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఎంత ఆవేశం ఉన్నా, గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారి పట్ల ఓ పద్ధతి ప్రకారం చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులే ఎందుకు అరెస్టు అవుతున్నారో వైసీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జగన్ వల్ల గతంలో శ్రీలక్ష్మీ లాంటి అధికారులు కూడా జైలుకు వెళ్లారు.. తెలుగుదేశం ప్రభుత్వంలో పని చేసిన అధికారులు ఇబ్బంది పడలేదని తేల్చి చెప్పారు. అక్రమ కేసులతో నాయకులు బలయ్యారు.. కానీ, మా వల్ల అధికారుల అరెస్టు కాలేదని మంత్రి అనిత తెలిపారు.
Read Also: Lady Aghori: పూజల పేరుతో లక్షల్లో మోసం.. లేడీ అఘోరీ అరెస్ట్
అయితే, టీడీపీ ప్రభుత్వం తప్పు చేయలేదనటానికి ఇదే నిదర్శనమని మంత్రి అనిత పేర్కొన్నారు. జగన్ నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వచ్చి అక్రమ కేసులపై మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెప్తారని ఎద్దేవా చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల విజ్ఞాపన మేరకే కేసును పునర్ విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ముఖ్యమంత్రితో శభాష్ అనిపించుకోవటానికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన అధికారులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అని ఆరోపించింది. ఇలాంటి వారంతా న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవాల్సిందే అని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చింది.