జననాయగన్ ఫక్తు దళపతి విజయ్ సినిమా అంటూ మొన్నటి వరకు ఊదరగొట్టాడు దర్శకుడు హెచ్ వినోద్. ట్రైలర్ వచ్చాక అసలు స్వరూపం బయటపడింది. భగవంత్ కేసరికి కాపీ పేస్ట్ అంటూ విమర్శలొచ్చాయి. బాలకృష్ణను విజయ్ మ్యాచ్ చేయలేకపోతున్నాడని ఆల్రెడీ ఈ మూవీని వాచ్ చేసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసమేనా కెవిన్ ప్రొడక్షన్ హౌస్ రూ. 380 కోట్లు ఖర్చుపెట్టింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇదే కాదు.. విజయ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా మారింది. దళపతి సార్ కూడా భారీగానే పుచ్చుకున్నారట.
Also Read : Hidden Camera : సంధ్య థియేటర్‌లో షాకింగ్ ఘటన.. బాత్రూంలో సీక్రెట్ కెమెరా
ఫస్ట్ నుండి ఇది విజయ్ చివరి సినిమా అంటూ తమిళ తంబీలపై సెంటిమెంట్ రుద్దేశారు. దీనికి తగ్గట్లుగానే సినిమాకు తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు స్టార్ హీరో. ఇక సినిమాలు చేయను కాబట్టి.. ప్రొడక్షన్ హౌస్ నుండి భారీగా వసూలు చేశాడు. రూ. 220 కోట్లు అంటే బడ్జెట్‌లో 60 శాతం అతడి రెమ్యునరేషన్ రూపంలో పోయిందట. దర్శకుడు హెచ్ వినోద్‌కు రూ. 25 కోట్లు ముట్టాయట. ఇక వీరి తర్వాత అనిరుధ్ రవిచంద్రన్.. ఈ రీమేక్ సినిమా కోసం రూ. 15 కోట్లు ఛార్జ్ చేశాడని చెన్నై టాక్. హీరోయిన్ పూజా హెగ్డేకు, నెగిటివ్ రోల్ చేసిన బాబీడియోల్‌కు రూ. 3 కోట్లు చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇక శ్రీలీల క్యారెక్టర్ పోషిస్తున్న మమితా బైజుకు రూ. 60 లక్షలు తీసుకుందని తెలుస్తోంది. మిగిలిన యాక్టర్లకు రూ. 8 కోట్లు వరకు అయ్యిందట. వీటికి తోడు సెట్ అండ్ సీజీ వర్క్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారట. జననాగయన్‌ను తన పర్సనల్ అండ్ పొలిటికల్ కెరీర్‌కు బాగానే యూజ్ చేసుకుంటున్న దళపతి విజయ్.. తన లాస్ట్ మూవీతో ఓల్డ్ రికార్డ్స్ అన్నీ తిరగరాస్తాడా..? కెవిఎన్ సంస్థకు భారీ లాభాలను మిగిల్చే చిత్రంగా మారుతుందా ఈ నెల 9న తెలనుంది.