ఆంధ్ర ప్రదేశ్ కరోనా కారణంగా 6800 మంది చిన్నారులు ఇబ్బందుల్లో పడ్డారని ప్రభుత్వం గుర్తించింది. తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కొల్పోయిన వారు 6800 మంది చిన్నారులన్నట్టు తెలిపింది. అయితే ఇప్పటివరకు 4033 మంది పిల్లల వివరాలను సేకరించిన ప్రభుత్వం. ఇక అందులో 1659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టుగా గుర్తించిన విద్యాశాఖ… 2150 మంది ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నట్టు గుర్తించింది. మిగిలిన 524 మంది శిశువులుగా పేర్కొంది
అయితే కోవిడ్ సమయంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు ఉచితంగానే విద్యను అందించనున్న ప్రభుత్వం… కోవిడ్ కారణంగా ఇద్దరు తల్లితండ్రులు, లేదా ఎవరో ఒకర్ని కోల్పోయిన వారి వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో వారిని తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో కొనసాగించేలా చూడాలని… ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక తరహాలోనే యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్ లు ఇవ్వాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. దీని కోసం అయ్యే వ్యయాన్ని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం భర్తీ చేస్తుందని తెలిపింది. తల్లితండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల విషయంలో ఎలాంటి సమస్యనైనా మండల, డివిజనల్ విద్యాశాఖ అధికారులకు నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.