చంద్రబాబు అందుకే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా అంటించుకోవటం, అధికార పక్షంతో తిట్టించుకోవటం ఎందుకని అసెంబ్లీ బహిష్కరిస్తున్నాం అని టీడీపీ ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు. పక్క రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. ప్రజల గురించి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. తమ బండారం బయట పడుతుందనే అసెంబ్లీకి రాకుండా టీడీపీ పారిపోతోంది. తండ్రి, కొడుకులు 300 కోట్లు విలాసవంతమైన ఇంట్లో కూర్చుని జూమ్ లో మాట్లాడుతున్నారు. తండ్రి, కొడుకులు ఎందుకు అంత భయపడుతున్నారు… ఒక్క కోవిడ్ కేర్ సెంటర్ కు అయినా వెళ్ళే ధైర్యం ఉందా.. కరోనా సంక్షోభంలో ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు అని ప్రశ్నించారు.
ప్రభుత్వం చేస్తున్న కృషి చంద్రబాబు కంటికి కనిపించదు. మీసాలు మెలేయటం, కాళ్ళు చూపించటం చేసిన రఘురామ కృష్ణంరాజు బాడీ ల్యాంగ్వేజ్ ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు కేసీఆర్ పై 12 కేసులు పెట్టారు. చంద్రబాబు దేశ ద్రోహం అనే మాటే వినలేదంటున్నారు. అప్పుటి వైసీపీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పై కూడా దేశ ద్రోహం కేసు పెట్టారు… అదే కేసుతో బెదిరించి పార్టీ మారాలని ఒత్తిడి చేశారు. ప్రభుత్వం పై కుట్ర పన్నిన రఘురామ కృష్ణంరాజు వెనుక ఉన్న తన పాత్ర బయట పడుతుందనే చంద్రబాబు ఆందోళన. అందుకే అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. మార్చి నెలలో ఎన్నికల కోసం పట్టుబట్టారు. అందుకే అప్పుడు బడ్జెట్ ప్రవేశ పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ సమావేశం పడతామంటే మార్చిలో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు శ్రీకాంత్ రెడ్డి.
Also Read
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ వార్లో బిగ్ ట్విస్ట్.. నానిపై కేసు నమోదు
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
- Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
తాజావార్తలు
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!