ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏపీకి చేసిందేం లేదన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరుతో వందల కోట్లు వేస్ట్ చేశారన్నారు. మీలా డ్రామాలు చేయడం మాకు చేతకాదన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ అంశంపైనైనా అంతా మోసమే చేశారన్నారు ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఐదేళ్ళలో 20వేల కోట్లు మాత్రమే పెట్టుబడులుగా వచ్చాయన్నారు. కడప, తిరుపతిలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు.
కరోనా అంటించుకోవటం, అధికార పక్షంతో తిట్టించుకోవటం ఎందుకని అసెంబ్లీ బహిష్కరిస్తున్నాం అని టీడీపీ ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు. పక్క రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. ప్రజల గురించి మాట్లాడే చిత్తశుద్ధి…