ఏపీ ఉద్యోగుల పీఆర్సీ అంశం ఇప్పట్లో తేలేలా లేదు. ఓవైపు ప్రభుత్వం ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి వ్యవహరించాలని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం అందుకు సంసిద్ధంగా లేరు. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపిన అవేవి సఫలం కాలేదు. అటు ప్రభుత్వాన్ని, ఉద్యోగులను ఒకే తాటి మీదకు తీసుకురావాలని సీఎస్ సమీర్ శర్మ చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. మంత్రులు సైతం పలు మార్లు ఉద్యగ సంఘాల నాయకులతో భేటీ అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఒకే తాటి పైకి వచ్చి ప్రభుత్వానికి తమ నిరసనలను వ్యక్తం చేయాలని చూస్తున్నారు.
Read Also: ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణా లేదా పరిష్కారమా..? : బొత్స సత్యనారాయణ
ఇప్పటికే ఉద్యోగ సంఘాలన్ని ఒకే తాటిపైకి వచ్చాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి కార్యచరణను సైతం సిద్దం చేసుకుంటున్నాయి. రేపు సీఎస్‌కు యాక్షన్ నోటీస్ అందజేయనున్న ఉద్యోగ సంఘాలు. రేపటి నుంచి ఆందోళన కార్యాచరణ సిద్ధం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు టెంట్టివ్ షెడ్యూల్‌ను సిద్ధం చేసిన ఉద్యోగ సంఘాలు . 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహానికి మెమొరాండంల సమర్పణ. ఈ నెల 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు ఫిబ్రవరి మూడున ఛలో విజయవాడ కార్యక్రమం. ఫిబ్రవరి 5 సహాయ నిరాకరణ. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.