బ్రేకింగ్: ఉద్యోగ సంఘాలకు మళ్లీ పిలుపు.. ఇవాళే పీఆర్సీ ప్రకటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఆర్సీపై ఇవాళే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.. గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎం వైఎస్ జగన్… ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.. ఇదే సమయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు ఏపీ సీఎం… రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. అయితే, పరిస్థితి చూస్తుంటే ఇవాళే ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది..
Read Also: వారికీ లేని కోవిడ్ మాకే ఉందా..? బీజేపీకి రూల్స్ వర్తించవా..?
Also Read
ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయంలో పీఆర్సీ అంశంపై అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు సీఎం జగన్.. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు.. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తానని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో పీఆర్సీపై ఫోకస్ చేసి చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగియగానే.. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు వెళ్లింది.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు సీఎం జగన్.. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఉద్యోగ సంఘాలకు సమాచారం వెళ్లింది.. గత మూడు రోజులుగా పీఆర్సీ పై దఫదఫాలుగా కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ ఉదయం కూడా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్, అధికారులతో సమగ్రంగా చర్చించారు.. ఇక, ఉద్యోగ సంఘాల భేటీలోనే ఫిట్మెంట్ అంకె చెప్పనున్నారు సీఎం జగన్.. అనంతరం ఉద్యోగ సంఘాల నేతల సమక్షంలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.. మొత్తంగా సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటించనుంది ఏపీ సర్కార్.
తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?