పీఆర్సీపై ఇవాళే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.. గురువారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన సీఎం వైఎస్ జగన్… ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్ చేసుకున్నానని.. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని తెలిపారు.. ఇదే సమయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు ఏపీ సీఎం……