కోవిడ్ చికిత్స, నివారణ చర్యల్లో విలేజ్ క్లినిక్‌లు కేంద్రంగా చికిత్స అందాలి, టెస్టింగ్, మెడికేషన్ విలేజ్ క్లినిక్ కేంద్రంగా జరగాలి, ఏఎన్‌ఏం, ఆశావర్కర్లు అందరూ విలేజ్ క్లినిక్‌ల కేంద్రంగా అందుబాటులో ఉండాలి.. పీహీచ్‌సీల పర్యవేక్షణలో విలేజ్ క్లినిక్‌లు పని చేయాలి అని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయనకు.. కోవిడ్ వ్యాప్తి, తాజా పరిణామాలపై వివరించారు అధికారులు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లభ్యత, ప్లాంట్ల పని తీరు వంటి వాటి పై ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.. వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీ పై సీఎం జగన్ కు నివేదిక సమర్పించారు.. కోవిడ్ వ్యాప్తి నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సమీక్ష జరిగింది.. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ న్యూ వేరియెంట్ బీఎప్– 7 ఎక్కడా నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మాస్క్ ధరించడంతో పాటు కోవిడ్ నివారణ చర్యలపై అవగాహన కలిగించాలని ఆదేశించారు.
Read Also: Fire Accident: పరవాడ ఫార్మసిటీలో ప్రమాదం.. నలుగురు మృతి
అనుమానాస్పదంగా ఉన్న కేసుల్లో తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలన్నారు సీఎం జగన్.. ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్న ఆయన.. కోవిడ్ పరంగా వచ్చే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల సన్నద్దతను ముందుగా తనిఖీ చేయాలన్నారు.. జనవరి 5వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సౌకర్యాల పైనా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.. మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టింగ్ కెపాసిటీపై మరోసారి సమీక్షించుకోవాలి.. లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్‌కు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు రిఫర్ చేసేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే, రోజుకు 60వేల ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కెపాసిటీ గతంలో ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. ప్రస్తుతం రోజుకు 30 వేల టెస్టింగ్ సామర్ధ్యముందని.. విజయవాడలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల టెస్టింగ్ ల్యాబులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు అధికారులు.. మరో 19 చోట్ల టెస్టింగ్ ల్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పని సరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.. 320 టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని తెలిపిన అధికారులు. ఎన్ – 95 మాస్కులు, కోవిడ్ పీపీఈ కిట్స్ అందుబాటులో ఉంచుతామన్న సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.