వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. వరద పోయి.. బురద మిగలడంతో.. ఇళ్లను, పరిసరాలను శుభ్రం చేసుకునే పనిలో పడిపోయారు ప్రజలు.. మరోవైపు.. భద్రాచలం దగ్గర మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.. ఓవైపు కోనసీమ జిల్లాల్లోని లంకల్లో ఇంకా ముంపు సమస్య వీడలేదు.. దీంతో.. అనేక గ్రామాలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు.. అయితే, ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి.. బాధితులతో మాట్లాడనున్నారు సీఎం జగన్.. రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లోని లంక ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది.. ఇక, తన పర్యటనలో మొదట జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులుతో వరద నష్టంపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇక, సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కింద పరిశీలించవచ్చు..