YS Jagan: ప్రధానికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. మోడీ చేతికి కోరికల చిట్టా…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికిన సీఎం వైఎస్ జగన్.. అదే సమయంలో.. తమ ప్రభుత్వ కోరికల చిట్టాను ఆయన చేతిలో పెట్టారు.. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాన మంత్రికి వీడ్కోలు పలికిన ఏపీ సీఎం.. అక్కడే మోడీకి విజ్ఞాపన పత్రం అందజేశారు.. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి పలు కీలక అంశాలను ప్రధానికి అందజేసిన విజ్ఞాపన పత్రంలో ప్రస్తావించారు సీఎం జగన్.. రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరారు సీఎం.. ఇక, తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని కోరారు ఆంధ్ర ముఖ్యమంత్రి.
Read Also: Viral: నడి సముద్రంలో రెండు ముక్కలైన ఓడ… రెస్క్యూ ఆపరేషన్ వైరల్..
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతు బద్ధత లేదని, దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్ జగన్.. ఇక, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలని కోరారు.. ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని విన్నవించారు.. విభజన వల్ల దెబ్బతిన్న రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తన వినతిపత్రంలో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్. కాగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!