ఈ రోజు మొత్తంగా ఐదు సబ్‌స్టేషన్ల ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో మరో 14 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.. ఈ సబ్‌స్టేషన్లు ప్రధానంగా పరిశ్రమలు, ఆక్వాకల్చర్ మరియు వ్యవసాయ రంగాలు మరియు గృహాలకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించగలవని అధికారి చెబుతున్నారు.. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ (జీఐఎస్) భౌతికంగా ప్రారంభించనున్న సీఎం.. మరో నాలుగు సబ్‌స్టేషన్‌లను ప్రారంభించి, మరో 14 వాటికి శంకుస్థాపన చేస్తారు.
ఓవైపు ఢిల్లీ వేదికగా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన జరగనుండా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ పార్టీ… హస్తినలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. హస్తినలో తెలంగాణ సీఎం కేసీఆర్ మూడురోజుల టూర్ బిజీబిజీగా సాగనుంది. మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని…
ఈరోజు 14 వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి సిద్ధమై మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ప్రతి వైద్య కళాశాలతో…